కోటగిరి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గణేష్
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని యాద్గార్పూర్ గ్రామ సమీపంలో శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
స్థానికుల కథనం ప్రకారం.. దోమలేడిగి గ్రామానికి చెందిన కాశేవార్ శంకర్, సుదేవార్ ప్రసాద్ బైక్‌పై ప్రయాణిస్తుండగా, వరి కోత యంత్రాన్ని ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో శంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రసాద్ తీవ్రంగా గాయపడ్డాడు.
సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన ప్రసాద్‌కు ప్రథమ చికిత్స అందించి బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనతో దోమలేడిగి గ్రామంలో విషాదం నెలకొంది.

























