Homeకామారెడ్డి జిల్లాఇనాయత్ నగర్ దాడి ఘటనపై ఏసీపీని కలిసిన బీజేపీ నేత మల్లికార్జున్ రెడ్డి...

ఇనాయత్ నగర్ దాడి ఘటనపై ఏసీపీని కలిసిన బీజేపీ నేత మల్లికార్జున్ రెడ్డి…

ఇనాయత్ నగర్ దాడి ఘటనపై ఏసీపీని కలిసిన బీజేపీ నేత మల్లికార్జున్ రెడ్డి

బీజేపీ నాయకుడు ఏగుర్ల రవి దంపతులపై దాడి.. తీవ్ర గాయాలయ్యాయని వెల్లడి

దాడికి పాల్పడిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్…

త్రిశూల్ న్యూస్ కమ్మర్‌పల్లి మండల్ రిపోర్టర్ గుర్రం నరేష్…

కమ్మర్‌పల్లి: నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం ఇనాయత్ నగర్ గ్రామంలో బీజేపీ నాయకుడు ఏగుర్ల రవి, ఆయన భార్యపై జరిగిన దాడి ఘటనపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి స్పందించారు.

గ్రామానికి చెందిన బీజేపీ కమ్మర్‌పల్లి మండల ఉపాధ్యక్షుడు ఏగుర్ల రవి దంపతులపై అదే గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు అకారణంగా దాడికి పాల్పడ్డారని మల్లికార్జున్ రెడ్డి ఆరోపించారు. ఈ దాడిలో రవి కాలు, చేయి విరగడంతో పాటు తలకు తీవ్ర గాయాలయ్యాయని, ఆయన భార్య చేతులకు కూడా గాయాలై ఎముకలు విరిగినట్లు తెలిపారు.

దాడి విషయం తెలుసుకున్న వెంటనే మల్లికార్జున్ రెడ్డి బాధితులను పరామర్శించి, అనంతరం ఆర్మూర్ ఏసీపీని కలిసి ఘటనపై ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తిపై విచారణ జరిపి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని ఏసీపీని కోరినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ కార్యకర్తలపై దాడులు జరిగితే పార్టీ చూస్తూ ఊరుకోదని, కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని, దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కమ్మర్‌పల్లి మండల బీజేపీ అధ్యక్షుడు బద్దం రమేష్ రెడ్డి, మోర్తాడ్ మండల అధ్యక్షుడు శివానంద రెడ్డి, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నరసింహారెడ్డి, చింత ప్రవీణ్ తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యా తనిఖీ బృందం!

0
ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యా తనిఖీ బృందం! భీంగల్ పాఠశాలలో బోధన, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన పథకం పరిశీలన ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచనలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీంగల్:...

నూతన ఎస్సైగా చిరంజీవి బాధ్యతల స్వీకరణ…

0
నూతన ఎస్సైగా చిరంజీవి బాధ్యతల స్వీకరణ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ భీమ్‌గల్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా ఎం.చిరంజీవి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఐ తిరుపతి బదిలీ కావడంతో ఆయన...

ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో!

0
ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో! రామడుగు గ్రామంలో హార్వెస్టింగ్ పనుల తనిఖీ కూలీలు నిర్ణీత కొలతల ప్రకారం పనిచేస్తే రోజుకు రూ.308 కూలి... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాద్ జిల్లా ధర్పల్లి...

సంగమేశ్వరులో వివాహిత అనుమానాస్పద మృతి!

0
సంగమేశ్వరులో వివాహిత అనుమానాస్పద మృతి! మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న మహిళ మృతి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన దోమకొండ పోలీసులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం దోమకొండ: కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర...

జిల్లాస్థాయి క్రీడా పోటీలకు లిటిల్ హార్ట్స్ విద్యార్థులు ఎంపిక!

0
జిల్లాస్థాయి క్రీడా పోటీలకు లిటిల్ హార్ట్స్ విద్యార్థులు ఎంపిక! కబడ్డీ, వాలీబాల్ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ లిటిల్ హార్ట్స్ పాఠశాల విద్యార్థులకు అభినందనలు తెలిపిన కరస్పాండెంట్ బి.ఏ. శ్రీకాంత్... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల...

Translate »
error: Content is protected !!