ఎన్‌ఎస్‌ఎస్–టీ7 క్రికెట్ ఛాంపియన్‌షిప్ పోస్టర్. ఆవిష్కరణ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
తెలంగాణ విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–I ఆధ్వర్యంలో (నవంబర్ 5) రేపు నిర్వహించనున్న ఎన్ ఎస్ ఎస్-టీ7 సెవెన్ ఓవర్ క్రికెట్ ఛాంపియన్‌షిప్ పోస్టర్‌ను విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ టి. యాదగిరిరావు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యం.యాదగిరి తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ క్రీడలు విద్యార్థుల్లోక్రమశిక్షణ,నాయకత్వలక్షణాలు,ఐక్యతను పెంపొందిస్తాయని పేర్కొన్నారు.రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యం.యాదగిరి మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటుక్రీడల్లోనూరాణించాలని,క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని విద్యార్థులకుసూచించారు.యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జి.రాంబాబుమాట్లాడుతూ,విద్యార్థుల్లోస్నేహభావం,సమష్టికృషినిప్రోత్సహించేందుకు ఈ పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్-1 ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్.సీ.హెచ్ శ్రీనివాస్ వలంటీర్లు పాల్గొన్నారు.























