Homeతెలంగాణనిజామాబాద్-1 ఆర్టీసీ డిపోలో అధికారుల వేధింపులా?

నిజామాబాద్-1 ఆర్టీసీ డిపోలో అధికారుల వేధింపులా?

నిజామాబాద్-1 ఆర్టీసీ డిపోలో అధికారుల వేధింపులా?

టీఐ-3, సీఐ అధికారుల తీరుపై డ్రైవర్ల ఆవేదన.. నచ్చిన వారికే డ్యూటీలు, మిగతా సిబ్బందికి వేధింపులంటూ ఆరోపణలు!

సిబ్బంది కొరత సాకుతో డ్రైవర్లపై అదనపు భారం.. తమకు కేటాయించిన విధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన…

 త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

నిజామాబాద్: కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లోనూ మెరుగైన పాలన ఉంటుందని ఆశించిన ఆర్టీసీ కార్మికులకు నిరాశే ఎదురవుతోందా? ప్రజా పాలనలోనూ ఆర్టీసీ సిబ్బంది సమస్యలు పరిష్కారం కావడం లేదని నిజామాబాద్-1 డిపోకు చెందిన కొందరు డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిజామాబాద్ నగర నడిబొడ్డున ఉన్న నిజామాబాద్-1 ఆర్టీసీ డిపోలో టీఐ-3, సీఐ స్థాయి అధికారుల వ్యవహారశైలిపై కొందరు డ్రైవర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిపోలో నిబంధనలు సక్రమంగా అమలు కావడం లేదని, అధికారుల ఇష్టానుసారంగా విధుల కేటాయింపు జరుగుతోందని వారు వాపోతున్నారు.

డిపోలో సిబ్బంది కొరత ఉందనే కారణంతో డ్రైవర్లపై అదనపు పనిభారం మోపుతున్నారని, ఈటీఎం మెషీన్ ద్వారా టికెట్లు జారీ చేసే బాధ్యతను కూడా డ్రైవర్లపైనే వేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకుని మరో చేత్తో టికెట్లు ఇవ్వాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయని, ఇది డ్రైవర్లకు ఇబ్బందిగా మారడమే కాకుండా ప్రయాణికుల భద్రతకు కూడా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరికొందరు డ్రైవర్లను లక్ష్యంగా చేసుకుని వారికి కేటాయించాల్సిన డ్యూటీలు ఇవ్వకుండా, టీమ్ ట్రైనింగ్ పేరుతో విధులకు దూరంగా ఉంచుతున్నారని ఆరోపిస్తున్నారు. అధికారులకు నచ్చిన వారికి అనుకూలంగా డ్యూటీలు కేటాయిస్తూ, మిగతా సిబ్బందిని బెదిరింపులకు గురిచేస్తూ మానసిక వేదనకు గురిచేస్తున్నారని వాపోతున్నారు.

ఆర్టీసీలో కార్మిక సంఘాలు ఉన్నప్పటికీ సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికుల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశించినప్పటికీ పరిస్థితుల్లో ఆశించిన మార్పు కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా స్పందించాలి!

నిజామాబాద్ ఆర్టీసీ ఆర్ఎం, డీఎం అధికారులు నిజామాబాద్-1 డిపోలో నెలకొన్న పరిస్థితులపై సమగ్ర విచారణ చేపట్టాలని డ్రైవర్లు కోరుతున్నారు. విధుల కేటాయింపులో పారదర్శకత పాటించాలని, సిబ్బందిపై వేధింపులు జరగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. డ్రైవర్లు, కార్మికుల సమస్యలను మానవతా దృక్పథంతో పరిశీలించి న్యాయం చేయాలని కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మైలారం వెంకటేశ్వర స్వామి ఆలయానికి రూ.50 లక్షలు మంజూరు…

0
మైలారం వెంకటేశ్వర స్వామి ఆలయానికి రూ.50 లక్షలు మంజూరు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండలం మైలారం గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ పునరుద్ధరణ, అభివృద్ధి...

BJYM యువ మోర్చా ఉపాధ్యక్షుడిగా నియామకం.. బీజేపీ నాయకులకు కృతజ్ఞతలు…

0
BJYM యువ మోర్చా ఉపాధ్యక్షుడిగా నియామకం.. బీజేపీ నాయకులకు కృతజ్ఞతలు... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ నిజామాబాదు జిల్లా ధర్పల్లి మండలం లోని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఉపాధ్యక్షుడిగా...

గోమాతను విశ్వమాతగా ప్రకటించాలి.. గోహత్యలను నిషేధించాలి!

0
గోమాతను విశ్వమాతగా ప్రకటించాలి.. గోహత్యలను నిషేధించాలి! కామారెడ్డిలో దేశవ్యాప్త సంతకాల సేకరణ ఉద్యమానికి విశేష స్పందన.. వేలాది సంతకాల సేకరణే లక్ష్యం: ఎల్లంకి సుదర్శన్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం కామారెడ్డి: గోహత్యలను పూర్తిగా నిషేధించాలని,...

ఆలయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి!

0
ఆలయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి! బీజేపీ ఆధ్యాత్మిక సెల్ నూతన కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ... ఇందూరు: జిల్లాలోని చారిత్రక ఆలయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే...

అభివృద్ధి పనుల్లో నాణ్యతే ముఖ్యం!

0
అభివృద్ధి పనుల్లో నాణ్యతే ముఖ్యం! 22, 25, 35వ డివిజన్లలో పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే ధన్‌పాల్... ఇందూరు: నగరంలోని అర్బన్ నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అర్బన్...

Translate »
error: Content is protected !!