విద్యార్థులకు కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఉచిత బ్యాగుల పంపిణీ!
కారేగాం ప్రభుత్వ పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు బ్యాగుల అందజేత…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ఏ గణేష్
కారేగాం, నవంబర్ 5: నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం కారేగాం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు.
ఎన్నారై కోనేరు శశాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాఠశాలలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా బ్యాగులు అందజేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం అభినందనీయమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయని పలువురు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కోనేరు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు హరికృష్ణ, ప్రకాష్ పటేల్, శ్రీనివాస్ పటేల్, సంజు మహారాజ్, నాగనాథ్ పటేల్, కపిల్ పటేల్, విజయ్ పటేల్, ఎన్. రామ్ చందర్, ఏ. గణేష్ పటేల్, పి. శ్రీనివాస్ తదితరులతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

























