దీపావళి వేళ పేకాట ఆడితే కఠిన చర్యలు!
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు.. ఎస్సై సందీప్ హెచ్చరిక…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి: దీపావళి పండుగ సందర్భంగా మండల పరిధిలో ఎక్కడైనా పేకాట ఆడినా, నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని ధర్పల్లి ఎస్సై సందీప్ హెచ్చరించారు. మండల ప్రజలు దీపావళి పండుగను ప్రశాంత వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని సూచించారు.
ఎవరైనా పేకాట ఆడుతున్నట్లు లేదా నిర్వహిస్తున్నట్లు సమాచారం అందితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. అదేవిధంగా దీపావళి ఆఫర్ల పేరుతో వచ్చే అనుమానాస్పద యాప్ లింకులను ఓపెన్ చేయవద్దని, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉంటూ సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్సై సందీప్ విజ్ఞప్తి చేశారు.

























