జోనల్ స్థాయి కబడ్డీ పోటీలకు ధర్పల్లి శ్రీ మేధా హైస్కూల్ విద్యార్థుల ఎంపిక!
సిర్నాపల్లిలో నిర్వహించిన ఎంపిక పోటీల్లో ప్రతిభ చాటిన విద్యార్థులు.. అభినందించిన పాఠశాల యాజమాన్యం…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని శ్రీ మేధా హైస్కూల్ విద్యార్థులు క్రీడల్లో సత్తా చాటారు. సిర్నాపల్లి గ్రామంలో నిర్వహించిన జోనల్ స్థాయి కబడ్డీ ఎంపిక పోటీల్లో ప్రతిభ కనబరిచి తదుపరి జోనల్ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
సబ్ జూనియర్ బాలికల విభాగంలో బాధావత్ పౌర్ణమి, యానాంపల్లి గ్రీషిక, జూనియర్ బాలికల విభాగంలో యానాంపల్లి చైత్విక, మేఘావత్ స్వప్న ఎంపికయ్యారు.
అదేవిధంగా సబ్ జూనియర్ అండర్-14 బాలుర విభాగంలో లచ్చల రితీష్, మేఘావత్ నిశాంత్, రామావత్ సాయికుమార్, జూనియర్ అండర్-17 బాలుర విభాగంలో లచ్చల రిషి, దాసరి సూర్యతేజ జోనల్ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా విద్యార్థుల విజయంపై పాఠశాల కరస్పాండెంట్లు మదన్ సురేష్, అరవింద్, ప్రిన్సిపాల్ జయరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఎంపికైన విద్యార్థులను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
విద్యార్థులకు కబడ్డీలో మెరుగైన శిక్షణ అందించి వారి ఎంపికకు కృషి చేసిన పీటీ ఉపాధ్యాయుడు శ్రీకాంత్ రెడ్డిని పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది.

























