సీతాయిపేట్ లో విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశానికి హాజరైన సర్పంచ్,ఉపసర్పంచ్…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా, ధర్పల్లి మండలంలోని సీతాయిపేట్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో గురువారం విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సర్పంచ్ సీహెచ్ భూమేష్, ఉపసర్పంచ్ చంద్రకాంత్ హాజరయ్యారు. పాఠశాలలో అందుతున్న బోధన, విద్యార్థుల ప్రగతి, మౌలిక వసతులపై చర్చించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించిన వారు, పాఠశాల అభివృద్ధికి గ్రామపంచాయతీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రటరీ శ్రీకాంత్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు























