Homeతెలంగాణజేసీఎస్ ప్రసాదును స్మరిస్తూ విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీ...

జేసీఎస్ ప్రసాదును స్మరిస్తూ విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీ…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పిడిఎస్ యు  నిజామాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో కామ్రేడ్ జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ను స్మరిస్తూ నగరంలోనీ చంద్రశేఖర్ చౌరస్తా నుండి సుభాష్ నగర్ తెలంగాణ తల్లి విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్షులు.కర్క.గణేష్, ప్రధాన కార్యదర్శి ఎల్. అనిల్ కుమార్ లు మాట్లాడుతూ,విద్యార్థి అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా జెసిఎస్ ప్రసాదును స్మరిస్తూ ఈ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. పిడి ఎస్ యు విద్యార్థి ఉద్యమ నిర్మాత కామ్రేడ్ జేసిఎస్ ప్రసాద్ నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తొండ గ్రామ వాసి కావడం జిల్లా విద్యార్థులకుగర్వకారణమన్నారు.ఉస్మానియా అరుణతార కామ్రేడ్ జార్జిరెడ్డి మరణం తర్వాత పి.డి.ఎస్.యు ఉద్యమాన్ని భుజాల ఎత్తుకున్న కామ్రేడ్ జేసిఎస్ ప్రసాద్ ను,అప్పటి ఎమ్మెల్సీ నీలం రామచంద్రయ్య గారిని 1975 నవంబర్ 5న పోలీసులు విజయవాడ బస్టాండ్ వద్ద పట్టుకొని ఖమ్మం చీకటి గండ్ల అడవుల్లో కాల్చి చంపారన్నారు. జార్జిరెడ్డి,జెసిఎస్ ప్రసాదుల ప్రాణ త్యాగాలతో ప్రగతిశీల విద్యార్థి ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందన్నారు. వారి ఆశయాల వెలుగులో రంగవల్లి,శ్రీపాద శ్రీహరి, చేరాలు,కోలా శంకర్ లు ఈ విద్యార్థి ఉద్యమానికి ఊపిరిలూదారన్నారు.కేంద్ర రాష్ట్రప్రభుత్వాలుఅవలంబిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా విద్యాప్రవేటీకరణ,కాషాయీకరణకు వ్యతిరేకంగా పోరాడటమే కామ్రేడ్ జేసిఎస్ ప్రసాద్ కు మనమిచ్చే నిజమైన నివాళి అవుతుందన్నారు. ఆ వెలుగులో విద్యార్థి ఉద్యమాన్నినిర్మిస్తామన్నారు.ఈకార్యక్రమంలోపిడిఎస్యు నగర అధ్యక్షులు. నసీర్,నగర ఉపాధ్యక్షులు. సృజన్,నగర నాయకులు మణితేజ,శ్రీశాంత్, భానుప్రియ,సుజాత, అర్చన,లక్ష్మి,లావణ్య, సుప్రియ,సౌజన్య,కళ్యాణి, మమత,వసంత,పుష్ప తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

నిజామాబాద్-1 ఆర్టీసీ డిపోలో అధికారుల వేధింపులా?

0
నిజామాబాద్-1 ఆర్టీసీ డిపోలో అధికారుల వేధింపులా? టీఐ-3, సీఐ అధికారుల తీరుపై డ్రైవర్ల ఆవేదన.. నచ్చిన వారికే డ్యూటీలు, మిగతా సిబ్బందికి వేధింపులంటూ ఆరోపణలు! సిబ్బంది కొరత సాకుతో డ్రైవర్లపై అదనపు భారం.. తమకు కేటాయించిన...

ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెర.. ఇందల్వాయి ROB నిర్మాణానికి ముందడుగు!

0
ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెర.. ఇందల్వాయి ROB నిర్మాణానికి ముందడుగు! రైల్వే గేటు వద్ద ట్రాఫిక్ కష్టాలకు త్వరలో చెక్? సర్వే చేపట్టిన రైల్వే అధికారులు.. త్వరలో డీపీఆర్ సిద్ధం చేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు... త్రిశూల్ న్యూస్...

ఎన్‌ఎస్‌ఎస్–టీ7 క్రికెట్ ఛాంపియన్‌షిప్ పోస్టర్. ఆవిష్కరణ…

0
ఎన్‌ఎస్‌ఎస్–టీ7 క్రికెట్ ఛాంపియన్‌షిప్ పోస్టర్. ఆవిష్కరణ... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–I ఆధ్వర్యంలో (నవంబర్ 5) రేపు నిర్వహించనున్న ఎన్ ఎస్ ఎస్-టీ7 సెవెన్ ఓవర్ క్రికెట్ ఛాంపియన్‌షిప్ పోస్టర్‌ను...

దీపావళి వేళ పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవు!

0
దీపావళి వేళ పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవు! పేకాట ఆడినా.. ఆడించినా చట్టపరమైన చర్యలు తప్పవు – పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య పేకాట స్థావరాలపై ప్రత్యేక బృందాలతో నిఘా.. సమాచారం తెలిస్తే...

తెలంగాణ యూనివర్సిటీలో రేపు ‘వికసిత్ భారత్ యువ సంవాద్ – 2026…

0
తెలంగాణ యూనివర్సిటీలో రేపు ‘వికసిత్ భారత్ యువ సంవాద్ – 2026’ యువతలో ప్రజాస్వామ్య విలువలు, పౌర బాధ్యతలు, నాయకత్వ లక్షణాలపై అవగాహన... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ నిజామాబాద్, నవంబర్ 4: తెలంగాణ విశ్వవిద్యాలయంలో నవంబర్...

Translate »
error: Content is protected !!