దీపావళి వేళ పేకాట ఆడితే కఠిన చర్యలు!
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు.. ఎస్ఐ సుమలత హెచ్చరిక…
త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం
ఇందల్వాయి: దీపావళి పండుగ సందర్భంగా మండల పరిధిలో ఎక్కడైనా పేకాట ఆడినా, నిర్వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఇందల్వాయి ఎస్ఐ సుమలత హెచ్చరించారు. మండల ప్రజలు దీపావళి పండుగను ప్రశాంతమైన వాతావరణంలో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని సూచించారు.
ఎవరైనా పేకాట ఆడుతున్నట్లు లేదా నిర్వహిస్తున్నట్లు సమాచారం అందితే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. అదేవిధంగా దీపావళి ఆఫర్ల పేరుతో వచ్చే అనుమానాస్పద యాప్ లింకులను ఓపెన్ చేయవద్దని, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
సైబర్ మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని, అనుమానాస్పద కార్యకలాపాలు లేదా మోసాలపై సమాచారం ఉంటే వెంటనే ఇందల్వాయి పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ఎస్ఐ సుమలత ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

























