Homeతెలంగాణశ్రీ సాయి ప్రసన్న హైస్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు...

శ్రీ సాయి ప్రసన్న హైస్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు…

శ్రీ సాయి ప్రసన్న హైస్కూల్‌లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

విభిన్న వేషధారణలు, చిట్టి చిట్టి మాటలతో అలరించిన చిన్నారులు..

బోధన్ పట్టణంలోని శ్రీ సాయి ప్రసన్న హైస్కూల్‌లో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు బుడిబుడి అడుగులు, చిట్టి చిట్టి మాటలతో విభిన్న వేషధారణల్లో అందంగా ముస్తాబై అందరినీ ఆకట్టుకున్నారు.

ముందుగా బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చిన్నారులు వివిధ ఆకృతుల్లో రూపొందించిన చిత్రాలు, కళాకృతులను ప్రదర్శించారు. అంతేకాకుండా తమ చిట్టి చేతులతో తయారుచేసిన విభిన్న వంటకాలను ప్రదర్శించి, వాటి తయారీ విధానాన్ని తమకు వచ్చిన మాటల్లో వివరించారు. చిన్నారుల ప్రదర్శనలను చూసిన తల్లిదండ్రులు, పెద్దలు, ఉపాధ్యాయ సిబ్బంది ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ జయప్రకాష్ మాట్లాడుతూ పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జీవిత చరిత్ర, ఆయన బాల్యం, పిల్లలపై ఆయనకున్న ప్రేమాభిమానాల గురించి విద్యార్థులకు వివరించారు. ప్రతి చిన్నారి తన బాల్యాన్ని ఆనందంగా ఆస్వాదించాలని, బాలల దినోత్సవ వేడుకలు పిల్లల్లో ఆనందంతో పాటు సృజనాత్మకతను పెంపొందిస్తాయని తెలిపారు.

పిల్లలు దైవంతో సమానమని, ప్రతి ఒక్కరూ తమ బాల్యాన్ని సంతోషంగా గడిపేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని అన్నారు. బాల్యాన్ని ఆనందంగా ఆస్వాదించినప్పుడే పిల్లల్లో మేధోసంపత్తి, సృజనాత్మకత పెరుగుతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ జయప్రకాష్, ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

యువ సంకల్పంతోనే సమాజ వికాసం సాధ్యం: టూటా అధ్యక్షుడు డాక్టర్ ఎ. పున్నయ్య…

0
యువ సంకల్పంతోనే సమాజ వికాసం సాధ్యం: టూటా అధ్యక్షుడు డాక్టర్ ఎ. పున్నయ్య... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ యువతలో సామాజిక బాధ్యత, నాయకత్వ లక్షణాలు, సేవా దృక్పథం పెంపొందినప్పుడే సమాజం అభివృద్ధి పథంలో ముందుకు...

చిన్న కోతలతో క్లిష్టమైన ఆపరేషన్లు.. జీర్ణకోశ శస్త్రచికిత్సలో సరికొత్త అధ్యాయం!

0
చిన్న కోతలతో క్లిష్టమైన ఆపరేషన్లు.. జీర్ణకోశ శస్త్రచికిత్సలో సరికొత్త అధ్యాయం! తక్కువ నొప్పి.. వేగవంతమైన రికవరీకి అవకాశం.. లాపరోస్కోపిక్, రోబోటిక్ సర్జరీ ప్రత్యేకత: డా. సుధీర్ మూడద్ల... ఆధునిక వైద్యరంగంలో లాపరోస్కోపిక్, రోబోటిక్, మినిమల్లీ ఇన్వేసివ్...

లింబాద్రిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ఆర్మూర్ కోర్టు న్యాయమూర్తులు…

0
లింబాద్రిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న ఆర్మూర్ కోర్టు న్యాయమూర్తులు కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి సేవలో న్యాయమూర్తులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ :  మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన లింబాద్రిగుట్ట...

హామీల అమలుకు కౌన్సిలర్ కృషి…

0
హామీల అమలుకు కౌన్సిలర్ కృషి అభివృద్ధి పనులపై కౌన్సిలర్‌కు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్ నిజామాబాద్ జిల్లా భీంగల్ : పట్టణంలోని విద్యానగర్ కాలనీ రెండో వార్డు కౌన్సిలర్ పర్శ కుశలత అనంతరావును...

ఇది పేదల ప్రభుత్వం.. పేదల సంక్షేమమే ధ్యేయం…

0
ఇది పేదల ప్రభుత్వం.. పేదల సంక్షేమమే ధ్యేయం డిచ్‌పల్లి మండలంలో 790 మంది లబ్ధిదారులకు చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ అర్హులైన ప్రతి ఒక్కరికీ పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం: ఎమ్మెల్యే డా. ఆర్....

Translate »
error: Content is protected !!