నూతన చేయూత పింఛన్ మంజూరు పత్రాల పంపిణీ
8వ వార్డులో 25 మంది లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలు అందజేత
సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ప్రజా ప్రభుత్వం: కౌన్సిలర్ మామరి సందీప్…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
భీమ్‌గల్, నవంబర్ 22: నిజామాబాద్ జిల్లా : భీమ్‌గల్ పట్టణంలోని 8వ వార్డులో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్లకు సంబంధించి 25 మంది లబ్ధిదారులకు ఆదివారం మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
వార్డు కౌన్సిలర్ మామరి సందీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్, మున్సిపల్ చైర్‌పర్సన్ బోదిరే నాగమణి (స్వామి), వైస్ చైర్‌పర్సన్ సంటిలత (నర్సయ్య) ముఖ్య అతిథులుగా హాజరై లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ మామరి సందీప్ మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం కొత్తగా చేయూత పింఛన్లు మంజూరు చేయడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తోందన్నారు.
రానున్న రోజుల్లో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం మరిన్ని సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందడం సంతోషకరమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మజార్, పింఛన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

























