ఉప్లూర్లో ఘనంగా 77వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిన గొప్ప గ్రంథం – గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్…
త్రిశూల్ న్యూస్ కమ్మర్పల్లి మండల్ రిపోర్టర్ గుర్రం నరేష్
నిజామాబాద్ జిల్లా : కమ్మర్పల్లి మండలం ఉప్లూర్ గ్రామంలో 77వ భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్, యువజన సంఘం అధ్యక్షుడు బండి ఆంజనేయులు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం భారత రాజ్యాంగ పీఠికను చదివి, రాజ్యాంగ విలువలను కాపాడుతామని ప్రతిజ్ఞ చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ఏనుగందుల శైలేందర్ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు, స్వేచ్ఛను కల్పించిన గొప్ప గ్రంథమని అన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని సూచించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి నియోజకవర్గ ఇన్చార్జి బస రమేష్ యాదవ్, ఉప సర్పంచ్ తక్కురి శేఖర్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు డాక్టర్ నరేష్, వార్డు సభ్యులు, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

























