ఆపరేషన్ నిమిత్తమై వృద్ధురాలికి సకాలంలో రక్తం అందజేత
తల సేమియా చిన్నారులకు అండగా నిలుద్దాం
ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయ సభ్యులు డాక్టర్ బాలు…
త్రిశూల్ న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి గడిల లింగం
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై భూ లక్ష్మి (81) ఆపరేషన్ నిమిత్తమై బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో సింగరాయ పల్లి గ్రామానికి చెందిన మెదక్ శ్రీనివాస్ సకాలంలో స్పందించి రక్తదానం చేయడం జరిగిందని ఐవి ఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయ సభ్యులు డాక్టర్ బాలు తెలియజేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ 2007 నుండి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని,తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఎవరికి రక్తం అవసరం ఉన్న వారికి కావలసిన రక్తాన్ని అందజేయడం కోసం నిరంతరాయంగా కృషి చేస్తున్నామని కొన్ని సందర్భాల్లో రక్తదాతలు దొరకకపోవడంతో తీవ్ర ఇబ్బందులు గురవుతున్నాయని రక్తదానం పట్ల అపోహలను విడనాడి ప్రాణాలను కాపాడడానికి ముందుకు రావాలని అన్నారు. తల సేమియా బాధిత చిన్నారులకు ప్రతి 15 రోజులకు ఒకసారి రక్తం అవసరం ఉంటుందని ఆ చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నామని త్వరలోనే కామారెడ్డి జిల్లా కేంద్రంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి బాధిత చిన్నారులకు అందజేస్తామని అన్నారు. రక్తదాత శ్రీనివాస్ కు కృతజ్ఞతలు అని తెలియజేశారు.

























