రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో పాల్గొన్న గడ్డం ఇందుప్రియ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ర్యాలీలో పాల్గొన్న రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి…
త్రిశూల్ న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి గడిల లింగం
హైదరాబాద్ : ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో కలిసి రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ పాల్గొన్నారు.
భారత రాజ్యాంగ విలువలను కాపాడటం, ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించడం లక్ష్యంగా ఈ ర్యాలీ నిర్వహించారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ సమీపంలో ఉన్న భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్‌లోని దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది.
ఈ సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణ ప్రాముఖ్యతను చాటిచెబుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రవెల్లి స్వర్ణ, టీపీసీసీ నాయకులు, మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

























