ధర్పల్లిలో ఘనంగా అంతర్జాతీయ బాల్యవివాహాల నిర్మూలన దినోత్సవం…
బాల్యవివాహాల అనర్థాలపై విద్యార్థులకు అవగాహన…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ బిల్లా నవీన్…
నిజామాబాదు జిల్లా ధర్పల్లి అంతర్జాతీయ బాల్యవివాహాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ధర్పల్లి మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్యవివాహాల వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక సమస్యలను అధికారులు విద్యార్థులకు వివరించారు.
బాల్యవివాహాల కారణంగా బాలబాలికల విద్యాభ్యాసం మధ్యలోనే నిలిచిపోవడంతో పాటు, చిన్న వయసులో గర్భధారణ వల్ల తల్లీబిడ్డల ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడుతుందని తెలిపారు. 18 ఏళ్లలోపు బాలికలకు, 21 ఏళ్లలోపు బాలురకు వివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. ఎక్కడైనా బాల్యవివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు సమాచారం అందించాలని కోరారు. బాల్యవివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బి. మారుతి, ఎంపీవో ఎం. శ్రీధర్, పర్యవేక్షకులు సారంగపాణి, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రచన, ప్రధానోపాధ్యాయురాలు విజయ, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లు, ఎన్జీవో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

























