ఆదర్శ పాఠశాల విద్యార్థుల ఘనత
గురువారం : 30/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి ఆదర్శ పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో మెరుగైన ప్రతిభ కనబరిచారు. బుధవారం వెలువడిన ఫలితాల్లో పాఠశాలకు చెందిన 96 మంది విద్యార్థులకు గాను 93 మంది ఉత్తీర్ణులై, 97 శాతం ఫలితాలు సాధించినట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తెలిపారు. వీరిలో 12 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించగా.. శ్రీనిధి (553), ఎస్. లాస్య (542) అగ్రస్థానంలో నిలిచారు.























