ధర్పల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జయంతి వేడుకలు
గురువారం : 30/04/26/ త్రిశూల్ న్యూస్ ధర్పల్లి మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
ధర్పల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ హిందూ పురాణాల ప్రకారం భక్త ప్రహ్లాదుడిని రక్షించడానికి హిరణ్యకశిపుడిని అంతం చేయడానికి మహావిష్ణువు నరసింహ స్వామి అవతారంలో ఉద్భవించిన రోజన నరసింహ స్వామి జయంతి వేడుకలు జరుపుకుంటామని తెలిపారు.ఈ రోజున ఉపవాసం ఉండి, లక్ష్మీ నరసింహ స్వామికి అభిషేకం, అర్చనలు చేసి పానకం, వడపప్పు నైవేద్యంగా సమర్పిస్తే శత్రు భయం తొలగిపోతుందని, కష్టాల నుండి విముక్తి లభిస్తుందని అన్నారు.జయంతి వేడుకల సందర్భంగా ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించగా పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై స్వామి వారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.























