నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మోడల్ సైన్స్ నీట్ పీజీ ఎగ్జామినేషన్ 2-5-2026 నాడు కలదు, అట్టి పరీక్ష కేంద్రము వద్ద సెక్షన్ 163 BNSS అమలు : పోలీస్ కమిషనర్ వెల్లడి
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్ నగరంలోని అర్సపల్లి పరిధిలో సమీపంలో తేది 2-5-2026 (శనివారం)రోజున నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మోడల్ సైన్స్ నీట్ పీజీ ఎగ్జామినేషన్ పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ తరఫున కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పీ.ఎస్., తెలిపారు. పరీక్షలు జరిగే రోజుల్లో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షా కేంద్రము పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 163 BNSS (పాత సెక్షన్ 144 సి.ఆర్.పి.సి ) అమలులో ఉంటుందని వెల్లడించారు.
ఈ ఉత్తర్వుల ప్రకారం పరీక్షా కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఇద్దరికి మించి గుంపులుగా చేరడం నిషేధం. పరీక్షల సమయంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు అన్ని పరీక్ష కేంద్రాలలో తేది:-02-5-2026 నాడు (ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు)సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్లు , జిరాక్స్ షాపులు మరియు స్టేషనరీ దుకాణాలను తప్పనిసరిగా మూసివేయాలని సంబంధిత యజమానులకు సూచనలు జారీ చేసినట్లు తెలిపారు.
పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో ప్రత్యేక బందోబస్త్ ఏర్పాటు చేయబడుతుందని , కేంద్రాల వద్ద అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచుతామని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పరీక్షలు రాసే విద్యార్థులందరూ ప్రశాంతంగా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి విజయవంతంగా ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షిస్తూ *పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్.,* విద్యార్థులకు “ ఆల్ ది బెస్ట్ ” తెలిపారు

























