ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చైల్డ్ సేఫ్టీపై మూడు అవగాహన కార్యక్రమాలు
నిజామాబాదు పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్., ఆదేశానుసారంగా, నిజామాబాద్ భరోసా సెంటర్ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా చైల్డ్ సేఫ్టీ అంశంపై మూడు అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడినవి.
ఈ కార్యక్రమాలు మాక్లూర్ మండలంలోని గంగారమంdha గ్రామంలో మహిళలు మరియు స్వయం సహాయక సంఘాల (SHG) సభ్యులతో నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమంలో గంగారమంdha సర్పంచ్, భరోసా కో-ఆర్డినేటర్ రోజా, భరోసా సిబ్బంది పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహిళల భద్రత, బాలల రక్షణ, లింగ సమానత్వం, పితృస్వామ్యం, జెండర్ బైయాస్, సైబర్ నేరాల నివారణ, బాల్య వివాహాల నిర్మూలన, కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం (POSH Act), అలాగే భరోసా సెంటర్ అందిస్తున్న సేవలపై అవగాహన కల్పించారు.
మహిళలు, బాలికలు తమ హక్కులపై అవగాహనతో అప్రమత్తంగా ఉండాలని, పితృస్వామ్య భావనలు మరియు జెండర్ వివక్షను గుర్తించి ఎదుర్కోవాలని, సైబర్ మోసాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, బాల్య వివాహాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
ఈ సందర్భంగా అధికారులు ఇలాంటి అవగాహన కార్యక్రమాలను గ్రామ స్థాయిలో మరింత విస్తరించాల్సిన అవసరాన్ని పేర్కొన్నారు.

























