అత్యవసర సమయంలో అండగా.. సీఎం సహాయనిధి
8 లక్షల ఎల్.ఓ.సి లెటర్ ను అందజేసిన ఎమ్మేల్యే డా.ఆర్. భూపతి రెడ్డి
నిరుపేదలకు అత్యవసర సమయంలో కొండంత అండగా ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని నిజమాబాద్ రూరల్ నియోజకవర్గ *ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి* పేర్కొన్నారు. జక్రాన్ పల్లి మండలం మనోహరాబాద్ గ్రామానికి చెందిన *కర్రే మనోజ్ కుమార్ * అనారోగ్య సమస్యలతో.. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శస్త్ర చికిత్స నిమిత్తం రూ.8 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు సూచించారు. దీంతో *రూ.8 లక్షల సంబంధించి ఎల్.ఓ.సి లెటర్* ను బాధిత కుటుంబ సభ్యులలకు ఎమ్మేల్యే తన క్యాంపు కార్యాలయంలో గురువారం అందజేశారు.
ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులతో పాటు కాగ్రెస్ పార్టీ నాయకులు గంగాధర్,గ్రామస్తులు ఎమ్మెల్యే కు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేశారు.

























