జాతీయస్థాయిలో ఐదు సార్లు హాకీ క్రీడల్లో పాల్గొన్న హాకీ క్రీడాకారిని సన్మానించి , అభినందించిన పోలీస్ కమిషనర్
నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రతిభావంతురాలు, జాతీయ స్థాయిలో ఐదుసార్లు హాకీ క్రీడల్లో పాల్గొని జిల్లా ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటిన కుమారి మాలవత్ మమతను నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి . సాయి చైతన్య, ఐ.పి.ఎస్., సన్మానించి అభినందించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, క్రీడలు యువతలో క్రమశిక్షణ , ఆత్మవిశ్వాసం , నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చి జాతీయ స్థాయిలో ఐదుసార్లు తెలంగాణ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహించడం ఎంతో గొప్ప విషయమని , మాలవత్ మమత వంటి క్రీడాకారిణులు జిల్లాకు గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకుని అంతర్జాతీయ పోటీల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలని ఆకాంక్షిస్తూ , ఆమెకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకుని లక్ష్యసాధన దిశగా ముందుకు సాగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్ , ధర్పల్లి సి. ఐ . బి భిక్షపతి , సిరికొండ ఎస్. ఐ. జె. రామకృష్ణ , నిజామాబాదు జిల్లా హాకీ అసోసియేషన్ ప్రెసిడెంట్ విశాఖ గంగారెడ్డి , సెక్రటరీ రమణ , హాకీ కోచ్ శ్రీ నగేష్ మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

























