వైఎస్ షర్మిలా రెడ్డి ఏపీసీసీ చీఫ్ కామెంట్స్…
విద్యుత్ చార్జీలపై దోచింది కొండంత.. తిరిగిచ్చేది పిసరంత.
ఎన్నికల్లో కూతలు.అనంతరం జనాలకు వాతలు ఇప్పుడు చిల్లరతో పాచికలు
విద్యుత్ చార్జీల తగ్గింపు ముసుగులో ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్నది మాయాజాలం.*
ట్రూ అప్ కింద భారీగా షాకులు పెట్టి.. ట్రూ డౌన్ పేరుతో ఆయిట్మెంట్ రాస్తున్నారు.
రూ.15485 కోట్ల మేర సర్దుపోటు వేసి, ముష్టి రూ. 923 కోట్లు తగ్గించి..
ఉద్ధరించామని గొప్పలు చెప్పడం కూటమి ప్రభుత్వానికే చెల్లింది.
నిజంగా కూటమి ప్రభుత్వానికి కరెంటు ఛార్జీల తగ్గింపుపై చిత్తశుద్ధి ఉంటే,
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే దమ్ముంటే ..
ఏడాదికో పది పైసలు, పదమూడు పైసలు కాదు..
వసూలు చేస్తున్న ట్రూ అప్ భారాన్ని మొత్తంగా తగ్గించండి.
రెండేళ్లుగా వసూలు చేసిన అదనపు మొత్తాన్ని వినియోగ దారులకు తిరిగి చెల్లించండి.
ఎన్నికల్లో 30 శాతం మేర చార్జీల తగ్గింపు హామీని వెంటనే అమలు చేయండిఅని మండి పడ్డారు…

























