పవన్ మాస్టర్ ప్లాన్.. స్థానిక ఎన్నికలపై జనసేన ఫోకస్!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్ పెట్టింది. ఈ ఎన్నికలను అస్త్రంగా మలుచుకోవాలని భావిస్తోంది. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో 21 అసెంబ్లీ సీట్లు, రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసిన జనసేన.. ఇప్పుడు స్థానిక ఎన్నికల్లోనూ తన బలాన్ని చాటుకోవాలనే వ్యూహంతో అడుగులు వేస్తోంది. పార్టీకి బలమైన కేడర్ ఉన్న చోట్ల రాజీ పడకుండా సీట్లు తీసుకోవాలని భావిస్తోంది.























