మహిళా అదృశ్యం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్…
నందిపేట మండలం కుద్వాన్పూర్ గ్రామానికి చెందిన చొక్కం భూలక్ష్మి అనే వివాహిత తన నాలుగేళ్ల కూతురు రుద్రతో గత నెల రోజుల నుండి కనబడటం లేదని, భూలక్ష్మి భర్త మహేష్ 9 నెలల క్రితం గల్ఫ్ కెళ్ళడం జరిగిందని ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు. ఆమె అత్త గంగుబాయి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, అదృశ్య మహిళ, ఆమె కూతురు రుద్ర ఆచూకీ ఎవరికైనా తెలిసినచో పోలీసులకు కానీ, 871 26 59 861 నంబర్ కు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ తెలిపారు.























