ఇద్దరు పిల్లల్ని మేనత్త ఇంట్లో వదిలి.. భార్యాభర్తలు ఆత్మహత్య…
తెలంగాణ : నిజామాబాద్‌లోని వినాయక్ నగర్‌లో ఆర్థిక ఇబ్బందులతో నరేష్, మేఘన అనే దంపతులు మంగళవారం ఆత్మహత్య చేసుకున్నారు. తమ ఇద్దరు పిల్లలను మేనత్త ఇంట్లో వదిలి వచ్చిన తర్వాత, నరేష్ ఉరి వేసుకోగా.. మేఘన విషం తాగి మరణించింది. ఈ ఘటనతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.























