ఆగస్టు 15న సంగారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి.. కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ!
ఆగస్టు 15న సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా లక్ష మందితో బహిరంగ సభ నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సంగారెడ్డికి చేరుకుని, సాయంత్రం 4 గంటల వరకు అక్కడే ఉంటారు.ఈ సభ వేదిక నుంచే లబ్ధిదారులకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను సీఎం పంపిణీ చేయనున్నారు. భద్రత, సభా ఏర్పాట్లపై నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి అధికారులతో సమీక్షించి, సభను విజయవంతం చేయాలని ఆదేశించారు.























