డిచ్పల్లి మండలంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు…
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ జెండాకు వందనం చేశారు.
ఈ కార్యక్రమంలో డిచ్పల్లి మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షులు నీరడి దేవరాజ్, ఎడ్ల ఆనంద్, మిల్లర్ అంజన్న, పురసాని శ్రీనివాస్, నాజీర్, దాసు, నర్సయ్య, పద్మ తదితరులు పాల్గొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

























