దేవన్ పల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరం విజయవంతం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
లయన్స్ క్లబ్ భీమ్‌గల్–వేముగల్లు ఆధ్వర్యంలో దేవనపల్లి గ్రామంలో మంగళవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు.
ఈ శిబిరంలో 98 మందికి కంటి పరీక్షలు నిర్వహించగా, 9 మందికి మోతిబిందు (క్యాటరాక్ట్) ఆపరేషన్ అవసరమని వైద్యులు గుర్తించారు. వారికి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచితంగా ఆపరేషన్లు చేయించేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు, అవసరమైన వారికి ఉచిత వైద్య సేవలు అందించడం లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో భాగమని తెలిపారు.
ఉచిత కంటి వైద్య శిబిరం ఇన్‌చార్జ్ లయన్ హనుమంతరావు, భీంగల్–వేముగల్లు అధ్యక్షులు లయన్ డాక్టర్ పడాల పురందర్, కోశాధికారి లయన్ ఎడ్ల శేఖర్, ఉపాధ్యక్షుడు టి. హనుమాన్లు, పీఆర్వో పురస్తు బద్రి, లయన్ వెంకటేష్, సర్పంచ్ శేఖర్ వార్డు సభ్యులు, ఉప సర్పంచ్, లయన్స్ క్లబ్ సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

























