మల్లాపూర్ గ్రామానికి రూ.5 లక్షల నిధులు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి
మండలం : మల్లాపూర్ గ్రామంలో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణానికి రూ.5 లక్షల నిధులు మంజూరయ్యాయి.
ఈ నిధులకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో గ్రామస్తులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.
నిధులు మంజూరు చేసినందుకు గ్రామస్తులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మోహన్, ఉపసర్పంచ్, స్థానిక నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

























