ధర్మారం (బి)లో వ్యక్తి మృతి.. హత్య జరిగిందని బంధువుల అనుమానం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ధర్మారం (బి) గ్రామానికి చెందిన తొత్తుల లింగయ్య (45) మృతిపై కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
లింగయ్య మృతదేహంపై గాయాలు ఉండటంతో హత్య జరిగి ఉండవచ్చని బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తూ, లింగయ్య భార్య పాత్రపై కూడా అనుమానం ఉన్నట్లు చెబుతున్నారు.
అయితే లింగయ్య మృతికి గల అసలు కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

























