కౌన్సిలర్లకు ఘన సన్మానం
కామారెడ్డి పట్టణంలోని పలు వినాయక మండపాల్లో ఘనంగా సన్మానం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం
కామారెడ్డి పట్టణంలోని పలు వినాయక మండపాల ఆధ్వర్యంలో 46, 47వ వార్డుల కౌన్సిలర్ గెరిగంటి స్వప్న లక్ష్మీనారాయణను ఘనంగా సన్మానించారు.
వినాయక మండపాల నిర్వాహకులు కౌన్సిలర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించి శాలువాలతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేశారు. అనంతరం తీర్థప్రసాదాలు అందించారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. గణనాథుడి ఆశీస్సులతో కామారెడ్డి పట్టణ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వినాయక మండపాల నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.

























