తండ్రి ఆస్తిలో వివాహిత కూతురి హక్కులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు…
హిందూ వారసత్వ చట్టం ప్రకారం తండ్రి ఆస్తిలో కూతుళ్లకు గల చట్టపరమైన హక్కులపై స్పష్టమైన వివరాలు:
*పూర్వీకుల ఆస్తి (Ancestral Property):*
• కుమారుడితో సమానంగా కుమార్తెకు కూడా పుట్టుకతోనే సమాన వాటా (Coparcener) లభిస్తుంది.
• కూతురికి వివాహం అయినా కాకపోయినా ఈ హక్కు వర్తిస్తుంది.
• సెప్టెంబర్ 9, 2005 నాటికి తండ్రి జీవించి ఉన్నా లేకపోయినా వాటా క్లెయిమ్ చేసుకోవచ్చు.
*స్వార్జిత ఆస్తి (Self-Acquired Property):*
• తండ్రి వీలునామా (Will) రాయకుండా మరణిస్తే, కొడుకులతో పాటు కూతురికీ సమాన వాటా దక్కుతుంది.
• ఒకవేళ తండ్రి జీవించి ఉన్నప్పుడు తన ఇష్టపూర్వకంగా ఎవరికైనా రాసిస్తే దాన్ని ప్రశ్నించే హక్కు ఉండదు.

























