ధర్పల్లిలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామసభ…
త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని గ్రామ సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలు, పారిశుధ్యం, ఆరోగ్య సంబంధిత అంశాలపై చర్చించారు. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు వీబీజీ రాంజీ కార్యక్రమం కింద కూలీలకు 125 రోజుల పని కల్పించే లక్ష్యంతో గ్రామంలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి రాకేష్ తెలిపారు.
అలాగే గ్రామంలోని ప్రతి వార్డులో నెలకొన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఆరోగ్యశాఖకు సంబంధించిన అంశాలపై కూడా అధికారులు, సిబ్బందితో చర్చించారు.
ఈ గ్రామసభలో ఉపసర్పంచ్ ఎజ్జ శ్రీకాంత్, పంచాయతీ కార్యదర్శి రాకేష్, హెల్త్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది భూలక్ష్మి, సుమలత, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది, వార్డు సభ్యులు, గ్రామస్థులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

























