తెలంగాణ యూనివర్సిటీలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
తెలంగాణ యూనివర్సిటీలో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు, విద్యార్థినులు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మలను పేర్చి, పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ టీ. యాదగిరిరావు, రిజిస్ట్రార్ ఎం. యాదగిరి పాల్గొని బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు. యూనివర్సిటీ అధికారులు, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

























