మళ్లీ మీరే రావాలి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయాలి!
పురానిపేట గ్రామ వీడీసీ సభ్యులకు గ్రామ ప్రజల కృతజ్ఞతలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్
పురానిపేట: గ్రామ అభివృద్ధికి విశేష కృషి చేసిన గ్రామ వీడీసీ సభ్యుల సేవలు చిరస్మరణీయమని గ్రామ ప్రజలు కొనియాడారు. 2026లో వీడీసీ సభ్యులు చేపట్టిన అభివృద్ధి పనులు గ్రామానికి ఒక మైలురాయిగా నిలిచాయని పేర్కొన్నారు.
ఎన్నో ఏళ్లుగా దేవాదాయ శాఖ ఆలయాలకు సంబంధించిన రహదారుల పునర్నిర్మాణం, కుంట మరమ్మతు పనులతో పాటు, దశాబ్దాలుగా నిరుపయోగంగా ఉన్న గ్రామ నడిబొడ్డుని స్థలాన్ని గ్రామ అవసరాలకు ఉపయోగపడేలా షట్టర్ల నిర్మాణం చేపట్టడం అభినందనీయమని గ్రామ ప్రజలు తెలిపారు.
అలాగే మొరవు కుంట సమీపంలో, లింబాద్రిగుట్టకు వెళ్లే రహదారి మార్గంలో పశువులు సేదతీరే స్థలాన్ని కాపాడేందుకు వీడీసీ సభ్యులు చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయమని అన్నారు. గ్రామ అభివృద్ధి కోసం నిస్వార్థంగా సేవలందించిన వీడీసీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
రాబోయే రోజుల్లో కూడా మళ్లీ మీరే వీడీసీ సభ్యులుగా బాధ్యతలు చేపట్టి, గ్రామాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని గ్రామ ప్రజలు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాల్టన్ తోట శంకర్, గోవింద్ హరికృష్ణ, డైడి రవి, మల్లెల జనార్దన్, ఓడ్డెం శ్రీనివాస్, ఊరె సుదర్శన్‌తో పాటు పలువురు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

























