కేజీబీవీ నాన్ టీచింగ్ సిబ్బంది, వర్కర్ల వేతనాలు పెంచాలి
వేతనాల పెంపుతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్..
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
కేజీబీవీల్లో పనిచేస్తున్న నాన్ టీచింగ్ సిబ్బంది, వర్కర్ల వేతనాలను పెంచడంతో పాటు వారి ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ యూనియన్ (టీయూసీఎల్) తెలంగాణ రాష్ట్ర కమిటీ నాయకులు కేంద్ర ప్రభుత్వ అధికారులను కలిశారు.
న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్, శక్తి భవన్లలో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ, కార్మిక శాఖ అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. కేజీబీవీ నాన్ టీచింగ్ సిబ్బంది, వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, వేతనాలు పెంచి న్యాయం చేయాలని వారు కోరారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.ఎల్. పద్మ, రాష్ట్ర కార్యదర్శి ఎం. సుధాకర్, రాష్ట్ర ఆఫీస్ బేరర్లు అరుణ, వీరమణి, హేమలత, లక్ష్మి, రమ, రాష్ట్ర నాయకులు సుమలత, అలివేలు, రామచంద్రిక, రమేష్, కవిత తదితరులు పాల్గొన్నారు.

























