బడా భీమ్ గల్ లో ఘనంగా దేవి ఉత్సవాలు.ఆరవ రోజు శ్రీమహాలక్ష్మి అవతారంలో అమ్మవారు.రూపాల దండలతో అమ్మవారికి అలంకరణ…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…
దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని బడా భీమ్‌గల్ గ్రామంలో దేవి ఉత్సవాలను గ్రామంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆరవ రోజైన శనివారం అమ్మవారు శ్రీమహాలక్ష్మి దేవి రూపంలో దర్శనం ఇవ్వగా నిర్వాహకులు దుర్గాదేవి ఉత్సవ కమిటీ, యువ చైతన్య యూత్ ల ఆధ్వర్యంలో అమ్మవారికి రూపాల(నోట్ల)దండలను వేసి పూజించారు. మంటపాన్ని నోట్ల దండలతో అందంగా అలంకరించి శ్రీమహాలక్ష్మి దేవిని స్తుతించారు. కొలువుదీరిన దుర్గాదేవికి ఐదో లక్షల రూపాయల వ్యయంతో వైభవంగా అలంకరణ చేపట్టారు. అమ్మవారి అలంకరణ భక్తులను ఆకట్టుకునేలా నిర్వహించడంతో ఉత్సవ ప్రాంగణంలో భక్తి వాతావరణం నెలకొంది. నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ఉత్సవ కమిటీ, యువజన సభ్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేపడుతున్నారు. గ్రామంలో దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.























