Homeతెలంగాణతాగునీటి అవసరాలకే తొలి ప్రాధాన్యత... ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి... యాసంగిలో వరి సాగు చేసి...

తాగునీటి అవసరాలకే తొలి ప్రాధాన్యత… ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి… యాసంగిలో వరి సాగు చేసి ఇబ్బందులు పడవద్దని రైతులకు హితవు…

తాగునీటి అవసరాలకే తొలి ప్రాధాన్యత…

ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి…

యాసంగిలో వరి సాగు చేసి ఇబ్బందులు పడవద్దని రైతులకు హితవు…

త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్…

ఎల్ నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురియక జలాశయాలలో నీటి నిల్వలు చేరని కారణంగా ప్రస్తుత పరిస్థితుల్లో తాగునీటి సరఫరాకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పి.సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. భీంగల్ తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి పాల్గొన్న సందర్భంగా స్థానిక రైతులను ఉద్దేశించి సుదర్శన్ రెడ్డి పలు సూచనలు చేశారు. వర్షాభావం వల్ల భూగర్భ జలాలు సైతం గణనీయంగా పడిపోతున్నాయని, మునుముందు పంటల సాగుకు సరిపడా విద్యుత్ సరఫరా చేసేందుకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అన్నారు. ఖరీఫ్ సీజన్లో సమృద్ధిగా సాగు జలాలు అందించామని, పూర్తి స్థాయిలో కరెంటు సరఫరా చేసి పంటలను కాపాడుకున్నామని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం ఎల్ నినో వల్ల తీవ్ర విపత్కర పరిస్థితులు నెలకొని ఉన్నందున, అందుబాటులో ఉన్న నీటి వనరులను పూర్తిగా తాగునీటి అవసరాల కోసమే వినియోగించాల్సిన ఆవశ్యకత నెలకొనిందని తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత యాసంగిలో వరి పంట వేయవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. వరి వేసుకుంటే సాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉన్నందున తక్కువ నీటితో సాగయ్యే కూరగాయలు, పప్పు దినుసు పంటల వైపు దృష్టి సారించాలని హితవు పలికారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భుజంగరావు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, భీంగల్ మున్సిపల్ చైర్మన్ నాగమణి, రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ మాజీ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, తహసీల్దార్ కిరణ్, నిజామాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నగేష్ రెడ్డి, స్థానిక రైతులు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన…

0
మోరాడ్‌లో అర్ధరాత్రి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ప్రతిష్ఠాపన త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే నగేష్ నిజామాబాద్ జిల్లా మోరాడ్ మండల కేంద్రంలో జాతీయ రహదారి పక్కన ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని శనివారం అర్ధరాత్రి...

సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్…

0
సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్ హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్...

ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం…

0
ధర్పల్లిలో ఘనంగా విజయదశమి ఉత్సవం త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని ధర్పల్లి సాయం శాఖ ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శనివారం (అక్టోబర్...

నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం…

0
నీటిని పొదుపుగా వినియోగిద్దాం.. ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా ఎదుర్కొందాం నీటి సంరక్షణ మనందరి బాధ్యత: ఎఫ్‌ఆర్‌ఓ రవి మోహన్ బట్టు... త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో నీటిని పొదుపుగా...

రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం…

0
రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవంలో కాంగ్రెస్ నాయకులకు ఘన సన్మానం... త్రిశూల్ న్యూస్ ధర్పల్లీ మండల్ రిపోర్టర్ బిల్ల నవీన్ ధర్పల్లి: నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఏడవ...

Translate »
error: Content is protected !!