దసరాకు ఊరెళ్తున్నారా? ఇంటి భద్రతపై అప్రమత్తంగా ఉండండి…
ప్రజలకు జిల్లా ఎస్పీ ఎం. రాజచంద్ర ఐపీఎస్ సూచనలు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం…
దసరా పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రజలు ఇళ్ల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా ఎస్పీ ఎం. రాజచంద్ర ఐపీఎస్ సూచించారు. పండుగ సమయంలో ఇళ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు దొంగతనాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇంటి నుంచి బయలుదేరే ముందు తలుపులు, కిటికీలు సక్రమంగా మూసి తాళాలు వేసుకోవాలని సూచించారు. ఇంట్లో నగదు, బంగారు ఆభరణాలు వంటి విలువైన వస్తువులను భద్రంగా ఉంచుకోవాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ పోలీసుల సూచనలు పాటించాలని ఎస్పీ తెలిపారు.























