తెలంగాణ విశ్వవిద్యాలయంలో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణవిశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం (ఎన్. ఎస్ ఎస్ ) యూనిట్–I అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీని ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–I ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ సీ హెచ్ శ్రీనివాస్ ప్రారంభించి మాట్లాడుతూ క్యాన్సర్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహనకలిగిఉండాలని,వ్యాధి లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించి తగిన వైద్య చికిత్స పొందడం ద్వారాక్యాన్సర్‌నుసమర్థవంతంగా ఎదుర్కోవచ్చని తెలిపారు.ఆరోగ్యకరమైన జీవనశైలి,పోషకాహారం,వ్యాయామం,పొగాకు మద్యపానానికి దూరంగా ఉండటం ద్వారా క్యాన్సర్ ముప్పునుకొంతవరకుతగ్గించుకోవచ్చని పేర్కొన్నారు.ర్యాలీలో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–I వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొని క్యాన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపు,చికిత్స ప్రాముఖ్యతనుతెలియజేస్తూ వివిధ నినాదాలతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు.క్యాన్సర్ పట్ల భయాన్ని వీడి,వ్యాధిపై సరైనఅవగాహనపెంపొందించుకోవాలని,క్రమంతప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్–I వాలంటీర్లు గౌతమ్ మనోహర్ బాలమణి మణిదీప్ కలీం రోహన్ స్వాతి త్రిష శశిక నీరజ సుస్వర హారిక పృథ్వి సౌందర్య శ్రావణి పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.























