తెలంగాణ యూనివర్సిటీలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ సభ్యులు…
త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ ప్రభాకర్
తెలంగాణ యూనివర్సిటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెలంగాణ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల రవి ఆధ్వర్యంలో, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు పుప్పాల రవి మాట్లాడుతూ.. తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఉన్నత విద్యాభివృద్ధికి ప్రభుత్వం కొత్తగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, కళాశాలలను మంజూరు చేయడం అభినందనీయమన్నారు.
పేదల పక్షపాతిగా పేరొందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని, భవిష్యత్తులో మరోసారి ముఖ్యమంత్రిగా అఖండ విజయం సాధించాలని ఆకాంక్షించారు. తెలంగాణ యూనివర్సిటీ తరఫున, అన్ని విభాగాల తరఫున, విద్యార్థుల తరఫున ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
అదేవిధంగా తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి, యూనివర్సిటీ ప్రగతికి అవసరమైన నిధులు సమకూర్చడంలో వారు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.

























