సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా!
కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు…
త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం
నిజామాబాద్ జిల్లా : ఇందల్వాయి మండలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంబరాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుజాత శ్రీనివాస్, గన్నారం శాఖ అధ్యక్షుడు బద్దం రెడ్డి, డాక్టర్ రాజేష్, తాళ్లరాజు, భామని గంగాధర్, ఎర్రసైలు మమత, నరసయ్య, బొడ్డు గంగాధర్, తాళ్ల రాజు తదితరులు పాల్గొన్నారు.

























