గన్నారంలో ఘనంగా ఇందిరమ్మ గృహ సంబరాలు…
త్రిశూల్ న్యూస్ ఇందల్వాయి మండల్ రిపోర్టర్ వైకుంఠం
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని గన్నారం గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ‘మన ఇందిరమ్మ ఇంట్లో దీపావళి’ కార్యక్రమంలో భాగంగా ఇందిరమ్మ గృహ సంబరాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి అధికారులు, ప్రజాప్రతినిధులు వేడుకల్లో పాల్గొన్నారు. స్వీట్లు పంపిణీ చేసి లబ్ధిదారులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు.
ఈ కార్యక్రమానికి ప్రత్యేక అధికారిగా జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి హాజరయ్యారు. ఎంపీడీవో అనంతరావు, గన్నారం గ్రామ సర్పంచ్ సుజాత శ్రీనివాస్, గ్రామ అధ్యక్షుడు బద్దం రెడ్డి, బొడ్డు గంగాధర్, పంచాయతీ కార్యదర్శి శ్వేత, తాళ్ల రాజు, డాక్టర్ రాజేష్, గంగాధర్, ఎర్రసైలు, జాజుల గోపి, గంగ భూదేవి, మమత, గుండ్ల నవీన్, కొయ్యల మంజుల తదితరులు పాల్గొన్నారు.

























