Homeతెలంగాణమీట్ ది ప్రెస్ లో జర్నలిస్టుల ప్రశ్నలకు కవిత సమాధానాలు

మీట్ ది ప్రెస్ లో జర్నలిస్టుల ప్రశ్నలకు కవిత సమాధానాలు

మీట్ ది ప్రెస్ లో జర్నలిస్టుల ప్రశ్నలకు కవిత సమాధానాలు

నేను రాజకీయ నేత, బీఆర్ఎస్ పార్టీ చీఫ్ అయిన కేసీఆర్ ని విమర్శించాను.

మా నాన కేసీఆర్ తో నాకు ఎలాంటి సమస్య లేదు. నా తల్లితండ్రులతో నాకు సమస్య లేదు.

కానీ రాజకీయ నేత కేసీఆర్ తో మాత్రం నాకు సిద్ధాంతపరమైన విబేధాలు ఉన్నాయి.

రాజకీయపరంగా ఆయన తప్పు చేస్తే కచ్చితంగా విమర్శిస్తా. నేను తప్పు చేసిన సరే బీఆర్ఎస్ విమర్శించవచ్చు.

తెలంగాణ వచ్చాక చాలా పనులు చేయాల్సి ఉండే.

లాస్ట్ ఆపర్చునిటీ కాస్ట్ అని ఉంటుంది. అవకాశం పోతే మళ్లీ రాదు.

కృష్ణా, గోదావరి నీళ్లను సరిగా వినియోగించుకొని ఉంటే తెలంగాణ రైతులకు రెండున్నర లక్షల కోట్లు వచ్చేవి.

లక్షా 21 వేల కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాలకు మాత్రమే నీళ్లిచారు.

నిరుద్యోగులకు మనం ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంటే పదిసార్లు పేపర్ ఎందుకు లీకైంది.

గొప్ప ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఉండగా పేపర్ లీక్ కావాల్సిన అవసరమేమొచ్చింది?

దాని కారణంగా తెలంగాణలో రెండు జనరేషన్లు నష్టపోయారు.

వాళ్లంతా ప్రభుత్వ ఉద్యోగం రాక వాళ్ల జీవితాలనే కోల్పోయిన పరిస్థితి ఉంది.

లాస్ట్ ఆపర్చునిటీస్ కాస్ట్ కారణంగా జరిగిన నష్టం బీఆర్ఎస్ ఖాతాలోకే వెళ్తుంది.

అందుకే నేను కేసీఆర్ ని విమర్శించాను. తప్పు చేస్తే మళ్లీ విమర్శిస్తాను.

పార్టీ పేరు కోసం మేము ప్రయత్నం చేస్తుండగా ఎన్నో కుట్రలు జరిగాయి.

వాటన్నింటిని ఎదుర్కొనేందుకే మేము చాలా టాక్టిక్స్ వాడాం.

పేరు విషయంలో కావాలనే వ్యుహంగానే చాలా పేర్లు చెబుతూ వచ్చాం.

ఐతే తెలంగాణ రక్షణ సేన అనే పేరును నేను మూడో ప్రాధాన్యతగా పెట్టాను.

కానీ టీఆర్ఎస్ నాకు రాసి ఉందేమో. ఎలక్షన్ కమిషన్ కూడా సరిగ్గా అదే పేరు ఇచ్చింది.

ఇది దైవ నిర్ణయమనే నేను భావిస్తున్నా.

నేను పార్టీ పెట్టగానే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు విమర్శించటం గమనించాను.

అసలు బీజేపీ అనే పార్టీ సామాజిక న్యాయానికి బద్ద విరోధ పార్టీ.

అందుకే బీసీ బిల్లును తొక్కి పెడుతున్నారు. మహిళ బిల్లు ఆమోదం పొందదని కూడా తెలిసి సభలో పెట్టారు.

అందుకు దేశ మహిళలు, తెలంగాణ మహిళలు కూడా ఈ బీజేపీని క్షమించరు.

ఇక్కడ అష్టగ్రహాలు అన్నట్లుగా ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు.

నేను పార్టీ పెడితే బీజేపీ ఎంపీ అర్వింద్ విమర్శిస్తున్నాడు. నన్ను విమర్శిస్తే ఏం వస్తుంది?

ముందు మోడీ ద్వారా తెలంగాణకు మేలు చేసే పనిచేయండి.

పాలమూరు కు జాతీయ హోదా తో పాటు తెలంగాణకు పెద్ద ఎత్తున నిధులు తెచ్చే పనిచేయండి.

ఒక పార్టీని పెట్టి ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలా అంటుంటారు.

కానీ ఈ ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ ఉండటమే పవర్. అది చిన్నదా, పెద్దదా అన్నది ప్రశ్నే కాదు.

పార్టీ అధికారంలోకి వస్తుందా లేదా అన్నది పార్టీ నడిపే వాళ్ల సిన్సియారిటీని బట్టి ఉంటుంది.

మేము చెప్పిన పాంచజన్యం అనే ఐదు అంశాలకు బడ్జెట్ సమస్య ఏమీ లేదు.

ప్రభుత్వానికి తమ ప్రాధాన్యతల ప్రకారం కేటాయించుకునేందుకు లక్ష కోట్ల రూపాయలు అందుబాటులో ఉన్నాయి.

వాటిని ఏ విధంగా విద్య, వైద్యానికి ఖర్చు చేయవచ్చో మొన్న ఉగాదికి మేము పెట్టిన బడ్జెట్ లో కూడా వివరించాం.

ప్రభుత్వానికి ఓ తల్లి మాదిరిగా ఆలోచన చేసే గుణం ఉండాలి.

కచ్చితంగా మేము చెప్పిన అంశాలు చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ ప్రభుత్వానికి ఆ ఉద్దేశం లేదు.

బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలోనూ చాలా అంశాలను పార్టీ అంతర్గత వేదికల్లో చెప్పాను.

కేసీఆర్ కి ఆధారాలతో సహా చాలా అంశాలపై ఫిర్యాదు చేశాను.

ఒక పార్టీలో పార్ట్ అండ్ పార్సల్ విధానంలో నేను భాగంగా ఉన్నప్పుడు బాస్ నిర్ణయానికి వ్యతిరేకంగా చేయలేం.

ఐతే ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల, భూ నిర్వాసితుల విషయంలో ఇంకా గట్టిగా నేను వాయిస్ పెంచాల్సి ఉండే.

దానికి కచ్చితంగా నేను క్షమాపణ అడుగుతున్నా. జనం బాట కార్యక్రమం మొదలుపెట్టిన తొలిరోజే క్షమాపణ కూడా కోరాను.

పాంచజన్యం అంశాలు సహా ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల విషయంలో నేను చెప్పిన మాట తప్పితే నన్ను అమరవీరుల స్ఫూపం వద్ద స్తంభానికి కట్టేసి కొట్టండి.

బీఆర్ఎస్ లో నేను ఏం తప్పు చేశానో నాకు అర్థం కాలేదు.

నాకు నోటీస్ ఇవ్వకుండానే నన్ను సస్పెండ్ చేశారు.

ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటోన్న రోహిత్ రెడ్డికి మాత్రం ఇటీవల షోకాజ్ నోటీసులు ఇచ్చారు.

నేను బీఆర్ఎస్ నుంచి వచ్చాక ప్రజల క్షేత్రంలోనే ఉండాలనుకున్నా.

ఈ రాష్ట్రానికి బీజేపీ ఏం చేయదు. తెలంగాణ కష్టాలకు, అమరవీరుల మరణాలకు కాంగ్రెస్సే కారణం.

ఆ రెండు పార్టీలతో నాకు కుదరదు. ప్రజల్లో ఉండలనుకునే నేను తెలంగాణ ప్రజల దగ్గరకే వెళ్లి పనిచేయాలని నిర్ణయించుకున్నా.

మా పార్టీలో యువతకు, మహిళలకు కచ్చితంగా ప్రాధాన్యం ఉంది.

గత కొన్ని నెలలుగా ఎంతో మంది మహిళలు, యువత పార్టీలో చేరారు.

కానీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు జాయిన్ అయినప్పుడు మాత్రమే మీడియా లో పెద్దగా వార్తలు వస్తాయి.

కానీ మా పార్టీలో యువత, మహిళలకే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.

నా టార్గెట్ బీఆర్ఎస్, కాంగ్రెస్ కాదు. సర్వోదయ తెలంగాణ సాధించటం.

మా పార్టీలో కచ్చితంగా మహిళలకు 33 శాతం తగ్గకుండా సీట్లు ఇస్తాం.

మహిళ బిల్లు పాస్ అయిన కాకపోయినా మేము మాత్రం 33 శాతం సీట్లు ఇస్తాం.

ఇంకా సాధ్యమైతే దాన్ని 50 శాతానికి కూడా పెంచే ప్రయత్నం చేస్తా.

కచ్చితంగా నేను ఏ అంశం తీసుకున్న సరే అందులో మహిళలకు ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది.

మహిళగా నేను పార్టీని నడపగలనా అని ప్రశ్నించటం సరికాదు.

ఇందిరాగాంధీ దేశాన్నే సమర్థవంతంగా నడిపారు.

మమతా బెనర్జీ, జయలలిత, మాయావతి లాంటి ఎంతో మంది మహిళలు సమర్థవంతంగా పాలన అందించారు.

వారి స్ఫూర్తితో మేము ముందుకు వెళ్తాం.

కచ్చితంగా పురుషులు నడుపుతున్న పార్టీ కన్నా కూడా బాగా మేము పార్టీ నడుపుతాం.

ఆధర్మంపై మేము యుద్ధం చేస్తాం. అది మనోళ్లైనా సరే…మా యుద్దం మాత్రం ఆధర్మం పైనే.

ప్రజలు కోరుకుంటున్న అంశాలను పట్టించుకోని పార్టీలు కచ్చితంగా కాలగర్భంలో కలిసి పోతాయి.

సామాజిక న్యాయం, అభివృద్ధి జోడెద్దుల మాదిరిగా మేము ముందుకు వెళ్తాం.

విద్య, వైద్యం కోసం చేసే ఖర్చుతో చాలా ఇళ్లు గుల్ల అవుతున్నాయి.

వాటికోసం మేము పెట్టే ఖర్చు కు అనుగుణంగా వెల్త్ క్రియేషన్ కూడా చేస్తాం.

వ్యవసాయం రంగంలోనే సరైన విధానాలు తెస్తే మరో 25 శాత వ్యవసాయాన్ని పెంచవచ్చు.

వినోభా భావే, గాంధీ స్ఫూర్తితో మేము సర్వోదయ తెలంగాణ అని తీసుకున్నాం.

గతం ఆ మూమెంట్ ఎంతో మంచి ఉద్దేశంతో జరిగింది.

మనం కూడా తెలంగాణను బంగారు తెలంగాణ కావాలని అనుకున్నాం. కానీ కాలేదు.

మేము మాత్రం సర్వజనుల్లో వెలుగులు నింపేలా ముందుకు వెళ్తున్నాం.

పాంచజన్యం అనే టూల్ తో సర్వదోయ తెలంగాణను సాధిస్తాం.

మాది క్యాడర్ బేస్డ్ గా ఉన్న పార్టీ, లీడర్ బేస్ట్ గా ఉన్న పార్టీ కాదు.

కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లో కార్యకర్తలకు ఏ మాత్రం విలువ లేదు.

కానీ మేము మాత్రం ప్రజలకు మంచి చేయాలని వస్తున్న కార్యకర్తలకు విలువ ఇస్తాం.

ప్రతి బూత్ లో కమిటీ లు, జిల్లాల్లో ఆఫీస్ లు పెట్టుకుంటాం.

మా విధానాలు ప్రజలకు అర్థమయ్యేలా వాళ్ల దగ్గరకు వెళ్లి వివరిస్తాం.

ప్రతి 25 ఏళ్లకు ఒకసారి రెవల్యూషన్ వస్తుంది.

ఇప్పుడు మేము సరిగ్గా రెవల్యూషన్ పాయింట్ వద్దే ఉన్నాం.

మా పార్టీలోకి పెద్ద లీడర్లు వస్తే సంతోషం. రాకపోతే మరీ సంతోషం

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి

0
వినాయక చవితి, దుర్గామాత మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి: ప్రజావాణిలో వి.హెచ్.పి., బజరంగ్ దళ్ వినతి... ఈ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆర్మూర్ నగర శాఖ ఆధ్వర్యంలో వినాయక చవితి...

డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి…

0
డిచ్ పల్లి మండలం ఘన్ పూర్ గ్రామం లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలంలోని ఘన్ పుర్ గ్రామంలో నూతన...

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్…

0
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు: కమ్మర్పల్లి SI, శ్రీ.CH.సతీష్... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... పాత కక్షలతో గొడ్డలితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన ఇద్దరు నిందితులను ఈరోజు అరెస్ట్...

డిచ్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెంటనే సొంత భవనం నిర్మించాలి…

0
డిచ్ పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెంటనే సొంత భవనం నిర్మించాలి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ నాయుడి ప్రభాకర్... నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి మండలం లో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి స్పందించాలి...

యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి…

0
యంగ్ ఇండియా పాఠశాలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి... డిగ్రీ కళాశాల భూములలో ఏర్పాటు చేయాలి... టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాలు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కామారెడ్డి నియోజకవర్గానికి కేటాయించిన యంగ్...

Translate »
error: Content is protected !!