Homeతెలంగాణగంజాయి , మత్తుపదార్థాల వినియోగదారులకు మరియు డ్రగ్స్ కేసులలో పట్టుబడిన వారికి , రౌడీషీటర్లకు కౌన్సిలింగ్...

గంజాయి , మత్తుపదార్థాల వినియోగదారులకు మరియు డ్రగ్స్ కేసులలో పట్టుబడిన వారికి , రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీస్ కమిషనర్

గంజాయి , మత్తుపదార్థాల వినియోగదారులకు మరియు డ్రగ్స్ కేసులలో పట్టుబడిన వారికి , రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీస్ కమిషనర్

మళ్లీ పునరావృతం అవుతే పి.డి యాక్టు తప్పదు అని హెచ్చరిక

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి  అనుముల రేవంత్ రెడ్డి  ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో గంజాయి మరియు మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతున్న నేపథ్యంలో , నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేడు జిల్లా పోలీస్ శాఖ మరియు ఈగల్ టీం ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమము నేడు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి  నిజామాబాద్ పోలీస్ కమిషనర్  పి. సాయి చైతన్య, ఐపీఎస్., హాజరు కావడం జరిగింది.

ఈ కార్యక్రమంలో గతంలో గంజాయి , డ్రగ్స్ వినియోగం మరియు అక్రమ రవాణా కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులు , రౌడీ షీటర్లు , అనుమానితులను పోలీస్ పరేడ్ గ్రౌండ్ కు పిలిపించి *ప్రత్యేక కౌన్సిలింగ్* నిర్వహించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్  మాట్లాడుతూ మత్తు పదార్థాల వినియోగం వలన యువత భవిష్యత్తు నాశనం అవుతుందని , కుటుంబాలు ఆర్థికంగా మరియు సామాజికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు.

గంజాయి మరియు డ్రగ్స్ వినియోగం ఆరోగ్యపరంగా ప్రమాదకరమేకాకుండా చట్టపరంగా కూడా తీవ్రమైన నేరమని , ఇటువంటి కార్యకలాపాల్లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో కేసులు నమోదైన వ్యక్తులు తమ ప్రవర్తన మార్చుకొని సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా జీవించాలని, మళ్లీ ఇలాంటి కార్యకలాపాల్లో పాల్గొంటే పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాల కింద చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించారు.

జిల్లాలో గంజాయి మరియు మత్తు పదార్థాల విక్రయాలు, రవాణా, వినియోగంపై నిరంతర నిఘా కొనసాగుతుందని, విద్యాసంస్థలు, హాస్టళ్లు, పబ్లిక్ ప్రదేశాల వద్ద ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నామని అధికారులు తెలిపారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి విద్య , ఉపాధి మరియు కుటుంబ భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని సూచించారు.

ప్రజలు కూడా సామాజిక బాధ్యతగా తమ పరిసరాల్లో ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్ విక్రయాలు లేదా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని తెలిపారు.

అనంతరం ఈగల్ టీం మరియు పోలీస్ సిబ్బంది ప్రత్యేక తనిఖీలు నిర్వహించి అనుమానితులకు డ్రగ్స్ పరీక్షలు చేపట్టారు. ఈ పరీక్షల్లో కొంతమంది వ్యక్తులకు డ్రగ్స్ వినియోగం పాజిటివ్‌గా తేలడంతో వారిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేసి కోర్టుకు తరలించారు.

ఈ అదనపు డీసీపీ (ఏ.ఆర్) శ్రీ రామ్ చందర్రావు , నిజామాబాద్ ఏసీపి  ప్రకాష్ ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ , ఈ గల్ టీం డీఎస్పీ  ఎం. సోమనాథం , హోమ్ గార్డ్ ఏసిపి కె. దీపక్ చంద్ర , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కె. శ్రీధర్ రెడ్డి , నిజామాబాద్ టౌన్ సిఐ  శ్రీనివాస రాజ్ , సౌత్ రూరల్ సిఐ ఎన్. సురేష్ కుమార్ , నార్త్ రూరల్ సీఐ  బి. శ్రీనివాస్ , డిచ్పల్లి సిఐ కె. వినోద్ , ధర్పల్లి సిఐ  బిక్షపతి , నిజామాబాద్ డివిజన్ ఎస్.హెచ్.ఓ లు , ఎస్ఐలు తదితరులు పాల్గొనడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు!

0
జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు! తెలంగాణలో జర్నలిస్టుల పాత అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితిని సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తూ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. జర్నలిస్టుల...

ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి…

0
ADF ద్వారా పేద కుటుంబాలకు అండగా ఎంపీ అర్వింద్ ధర్మపురి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కూనే జితేందర్... నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి జన్మదినం సందర్భంగా ఆయన ఆధ్వర్యంలోని అర్వింద్ ధర్మపురి ఫౌండేషన్ (ADF)...

గంజాయి, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన కమ్మర్‌పల్లి పోలీసులు…

0
గంజాయి, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించిన కమ్మర్‌పల్లి పోలీసులు... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గుర్రం నరేష్... కమ్మర్‌పల్లి మండల పరిధిలోని మారుతినగర్, హాసాకొత్తూర్ గ్రామం లో కమ్మర్‌పల్లి ఎస్సై శ్రీ. CH.సతీశ్ గారి ఆధ్వర్యంలో...

బెంగళూరులో కర్ణాటక మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి…

0
బెంగళూరులో కర్ణాటక మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి... త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ గడిల లింగం... కర్ణాటక రాష్ట్ర కేబినెట్ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ రిజ్వాన్ అర్షద్...

రాఖీ పౌర్ణమి సందర్భంగా సికింద్రాబాద్–ఆర్మూర్‌కు ప్రత్యేక బస్సులు…

0
రాఖీ పౌర్ణమి సందర్భంగా సికింద్రాబాద్–ఆర్మూర్‌కు ప్రత్యేక బస్సులు...  త్రిశూల్ న్యూస్ రిపోర్టర్ కే. నగేష్... రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆగస్టు 27, 28 తేదీలలో సికింద్రాబాద్ నుంచి ఆర్మూర్‌కు...

Translate »
error: Content is protected !!