న్యాయవాది హత్య హేయమైన చర్య…
దుండగుల అరెస్టు కు న్యాయవాద పరిషత్ డిమాండ్….
హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ వద్ద న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ పై జరిగిన కిరాతక దాడిని మరియు ఆయన విషాద మరణాన్ని న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఈ హత్య హేయమైన చర్య పేర్కొన్నారు
దుండగులు పథకం ప్రకారం కారుతో న్యాయవాదిని ఢీకొట్టి పారిపోయారని, ఆయన ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారని తెలియడం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఈ ఘటనను తర్వాత హత్య కేసుగా మార్చడం న్యాయవాదుల సమాజంలో భయం మరియు ఆందోళనను సృష్టించింది.
ఈ ఘటనపై సమగ్రమైన, నిష్పక్షపాతమైన మరియు వేగవంతమైన దర్యాప్తు జరిపించాలని న్యాయవాద పరిషత్ డిమాండ్ చేస్తున్నట్లు అలాగే పోలీసు అధికారులు సంబంధిత వ్యక్తులందరినీ గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ హత్య సంబంధించినది ప్రత్యేక కోర్టు లను ఏర్పాటు చేసి నేరస్థులపై త్వరిత గతిన విచారణ చేపట్టాలని చట్ట ప్రకారం కఠిన చర్యలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ కు న్యాయం కోసం న్యాయవాదుల సమాజం మొత్తం ఐక్యంగా నిలబడుతుంది మరియు శోకతప్త కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని న్యాయవాద పరిషత్ తెలియజేస్తుంది ఆయన పేర్కొన్నారు























