నిజామాబాద్ రీజియన్ లో టీజీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు విజయవంతం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్ రీజియన్ పరిధిలోని నిజామాబాద్-1, నిజామాబాద్-2, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, కామారెడ్డి డిపోలలో ఉద్యోగుల కోసం క్రీడా పోటీలు ఘనంగా నిర్వహించబడినట్లు రీజియన్ మేనేజర్ టి. జోష్నా తెలిపారు.
ఈ సందర్భంగా మహిళా మరియు పురుష ల కోసం 100 మీటర్ల పరుగుపందెం, మ్యూజికల్ చైర్ తదితర క్రీడా పోటీలు ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించగా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు.
పోటీల్లో విజేతలైన ఉద్యోగులకు బహుమతులను నిజామాబాద్ డిప్యూటీ రీజినల్ మేనేజర్ శ్ మధుసూదన్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ఉద్యోగుల్లో క్రీడాస్ఫూర్తి, ఐక్యత, ఆరోగ్య చైతన్యం పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు.
కార్యక్రమంలో డిపో మేనేజర్లు, సూపర్వైజర్లు సిబ్బంది పాల్గొని విజేతలను అభినందించారు. ఉద్యోగులు కూడా ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

























