నీతికి, నిజాయితీకి నిదర్శనం సీతక్క
అసత్య ప్రచారాలపై కోర్టు ఆగ్రహం
తెలంగాణ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) పై జరుగుతున్న దుష్ప్రచారానికి న్యాయస్థానం చెక్ పెట్టింది. మంత్రి సీతక్కపై నిరాధారమైన అవినీతి ఆరోపణలు చేస్తూ, ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యవహరిస్తున్న బీఆర్‌ఎస్ నాయకులకు కోర్టు గట్టి మొట్టికాయలు వేసింది.
అసత్య ఆరోపణలకు తావులేదు న్యాయస్థానం
మంత్రి సీతక్కపై సోషల్ మీడియా వేదికగా బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
*తక్షణమే తొలగించాలి*
మంత్రి ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్న అన్ని పోస్టులను, వీడియోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల నుండి వెంటనే తొలగించాలని ఆదేశించింది.

























