మిగిలిన డిప్లొమా కోర్సులకు అడ్మిషన్ చేసుకోవాలి…
త్రిశూల్ న్యూస్ నందిపేట్ మండల్ రిపోర్టర్ మూన్ డిజైన్ శేఖర్
నందిపేట్ జూన్1 త్రిశూల్ న్యూస్: నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో గల ప్రభుత్వ సాంకేతిక కళాశాల యందు స్పాట్ అడ్మిషన్స్ ఈనెల 4 తేదీన జరగనున్నాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ రాజ్ కుమార్ మాట్లాడుతూ…మా కళాశాలలోని మిగిలి ఉన్న డిప్లమో కోర్సులను బర్తి చేసేందుకు 4వ తేదీన స్పాట్ అడ్మిషన్స్ నిర్వహించడం జరుగుతుందని,10వ తరగతి పాసైన విద్యార్థులు సంబంధిత ధ్రువపత్రాలతో ఒకరోజు ముందు 3 తేదీన సాయంత్రం 4 గంటల లోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని, పాలీసెట్ ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుందని, మెరిట్ ఆధారంగా అడ్మిషన్ లభించునని, సెలెక్ట్ అయిన విద్యార్థులు ఒరిజినల్ టి సి, ధ్రువపత్రాల జిరాక్స్ కాపీల రెండు సెట్లు, మూడు ఫోటోలు, 6180రూ/- ఫీజు చెల్లించాల్సి ఉంటుందని, డిప్లమో పూర్తి చేసిన విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలలో మంచి అవకాశం లభిస్తుందని తెలిపారు.























